దోమల నివారణకు స్పెషల్ యాక్షన్ : మేయర్ విజయలక్ష్మి

దోమల నివారణకు స్పెషల్ యాక్షన్ : మేయర్  విజయలక్ష్మి

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. బుధవారం జోనల్, సర్కిల్ స్థాయి అధికారులతో కలిసి బంజారాహిల్స్ డివిజన్ బంజారా లేక్ లో ఉన్న గుర్రపు డెక్కతో పాటు ఇతర వ్యర్థాలను తొలగించే ప్రక్రియను పరిశీలించారు. 

యాంటీలార్వా ఆపరేషన్ (ఏఎల్ఓ) కార్యక్రమంలో భాగంగా ఎఫ్​టీసీ మెషీన్​తో పాటు డ్రోన్ తో దోమల నివారణకు చేపట్టే పిచికారీని మేయర్  ప్రారంభించారు. ఆమె  మాట్లాడుతూ.. వర్షాకాలంలో వ్యాధులు రాకుండా అవగాహన కల్పించడంతో పాటు ఏఎల్ఓ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో వార్డు లో నాలుగు దఫాలుగా ఫాగింగ్, శానిటేషన్ డ్రైవ్ ను చేపట్టామన్నారు. జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఎంటమాలజీ ఈఈ విజయ్ కుమార్ పాల్గొన్నారు.