14 జిల్లాల్లో భారీ వర్షాలు

14 జిల్లాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్, వెలుగు: రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం   నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌‌నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరులో 9 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం రికార్డయిందని వెల్లడించింది.