
హైదరాబాద్: సిటీ మెట్రో ఐటీ సంస్థల చుట్టు చక్కర్లు కొట్టనుంది. త్వరలోనే సాఫ్ట్ వేర్ల మెట్రో జర్నీ కలలు నెరవేరనున్నాయి. అమీర్‌పేట-హైటెక్ సిటీ 10కి.మీ రూట్ లో మెట్రోరైళ్లు నడిపేందుకు సిద్ధంగా ఉంది మెట్రో హైదరాబాద్. ఈ రూట్ లో రైళ్లు నడిపేందుకు శుక్రవారం కమిషన్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ ఆమోదం తెలిపింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రారంభ కార్యక్రమాలు లేకుండా.. సాదాసీదాగా మెట్రో రైళ్ల సేవలు అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. ఎలాంటి హడావుడి లేకుండానే మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. త్వరలోనే హైటెక్ సిటీ రూట్ లో మెట్రో సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ, మెట్రో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.త్వరలోనే ఇందుకు సంబంధించిన డేట్ ఫిక్స్ చేయనున్నట్లు తెలిపారు అధికారులు.