
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైలు సవరించిన టికెట్ చార్జీలు శనివారం నుంచి అమలులోకి రానున్నాయి. ఇటీవల పెంచిన ధరలపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించిన ఎల్ అండ్ టీ సంస్థ.. అన్ని స్లాబ్లలో ఈ రాయితీని అమలు చేయకుండా మరోసారి చాకచక్యాన్ని ప్రదర్శించింది. టికెట్ కొనుగోలు సమయంలో చిల్లర సమస్యను సాకుగా చూపిస్తూ డిస్కౌంట్లలో గందరగోళం సృష్టించడం ప్రయాణికుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
10% రాయితీ అని చెప్పి 7% మాత్రమే?
ప్రకటించిన 10 శాతం డిస్కౌంట్ అన్ని స్లాబ్లలో అమలు కాలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కొత్త ధరలపై డిస్కౌంట్ సగటున 7.14 శాతం మాత్రమే ఉందని చెబుతున్నారు. ఉదాహరణకు, 2-4 కిమీ దూరానికి కొత్త ధర రూ.18 నుంచి 10% డిస్కౌంట్‌తో రూ.16.20 ఉండాలి, కానీ రూ.17(5.56% డిస్కౌంట్)గా నిర్ణయించారు. అలాగే, 24 కిమీ పైన రూ.75 టికెట్ధర రూ.67.50 ఉండాలి, కానీ రూ.69(8% డిస్కౌంట్)గా నిర్ణయించారు. ఈ విధంగా, అన్ని స్లాబ్లలో డిస్కౌంట్ 5.56% నుంచి 8.33% మధ్యలోనే ఉంది. చిల్లర సమస్యను సాకుగా చూపిస్తూ ఇలా చేయడం కరెక్ట్కాదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఎల్ అండ్ టీ అధికారి స్పందిస్తూ.. పెంచిన ధరలపై పది శాతం డిస్కౌంట్ ఇచ్చామని, స్లాబుల వారీగా చూస్తే తక్కువ ఉంటుందని తెలిపారు.
తెలంగాణకు 70 శాతం రెవెన్యూ తీసుకొస్తున్న సిటీలోని పలు కాలనీలు, బస్తీలు, వాడల్లో మౌలిక సదుపాయాల కల్పనకు జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డుకు నిధులు కేటాయించకపోవడం శోచనీయమన్నారు. సిటీలో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు లేకపోవడంతోనే నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.