హైదరాబాద్ మెట్రో స్టేషన్లు కిటకిట.. రైళ్లల్లో ఎక్కలేక ఇబ్బందులు

హైదరాబాద్ మెట్రో స్టేషన్లు కిటకిట.. రైళ్లల్లో ఎక్కలేక ఇబ్బందులు

హైదరాబాద్ మెట్రో రికార్డ్ బ్రేక్ చేసింది. మెట్రో స్టేషన్లకు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. రోడ్లపై పెరుగుతున్న రద్దీతోపాటు ఎండాకాలం కావటంతో.. అందరూ మెట్రో వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 20వ తేదీ గురువారం అన్ని మెట్రో స్టేషన్లలో రద్దీ ఏర్పడింది. నాగోలు టూ రాయదుర్గం రూట్ అయితే రైల్లో ఎక్కేందుకు ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు. నాగోలు స్టేషన్ అయితే నిండిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. స్టేషన్లు ఫుల్ అయ్యి.. మెట్లపై వరకు నిల్చున్నారు ప్రయాణికులు.

ఉదయం సమయంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక రైలు నడుస్తుంది. ప్రస్తుతం నాగోలు, అమీర్ పేట రైల్వే స్టేషన్లలో పరిస్థితి చూస్తే.. నిమిషానికి ఒక రైలు నడిపినా ప్రయాణికులు సంఖ్య తగ్గేలా లేదు. ఎండాకాలం ప్రారంభం అయినప్పటి నుంచి సర్వీసుల సంఖ్య పెంచింది మెట్రో. అయినా రద్దీ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా నాగోలు, ఎల్బీనగర్, దిల్ షుఖ్ నగర్, కూకట్ పల్లి నుంచి ప్రాంతాల నుంచి ఉద్యోగ, వ్యాపారాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే వారు.. ఎండాకాలం కావటంతో చల్లగా మెట్రో వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది.

ముంబై, జపాన్ దేశాల్లో రెగ్యులర్ గా కనిపించే దృశ్యాలు ఇప్పుడు హైదరాబాద్ మెట్రో కనిపించటం విశేషం. మెట్రో ప్రారంభం అయిన కొత్తగా.. ఎలా ఉందో చూడ్డానికి జనం ఎగబడ్డారు.. మళ్లీ అలాంటి సిట్యువేషన్ రెగ్యులర్ రోజుల్లో కనిపించటం విశేషం.  కరోనా సమయంలో పీక్ లో రోజూవారీ ప్రయాణికుల సంఖ్య మూడు లక్షలు దాటింది. మళ్లీ ఇప్పుడు అది నాలుగు లక్షలకు రీచ్ అయినట్లు లెక్కలు చెబుతున్నారు. ఎండాకాలం.. ప్రస్తుతం ఐదు లక్షల మంది వరకు రోజువారీగా మెట్రో ప్రయాణిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం మెట్రో స్టేషన్లలో నెలకొన్న రద్దీతో సర్వీసులు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు మెట్రో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి.