ఉప్పల్ మ్యాచ్ కు మెట్రో స్పెషల్ ట్రైన్స్

ఉప్పల్ మ్యాచ్ కు మెట్రో స్పెషల్ ట్రైన్స్

హైదరాబాద్: ఈ నెల 25న ఉప్పల్ లో జరిగే భారత్–ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కోసం స్పెషల్ ట్రైన్స్ ను నడపునున్నట్లు  హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు తెలిపారు. మ్యాచ్ జరిగే రోజున రాత్రి 11 గంటలకు ఈ స్పెషల్ ట్రైన్ సర్వీసెస్ ప్రారంభమై... మధ్యరాత్రి ఒంటి గంట వరకు కొనసాగుతాయని చెప్పారు. అమీర్‌పేట్, జేబీఎస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి కనెక్టింగ్ రైళ్లు ఉంటాయని తెలిపారు. ప్రత్యేక రైళ్ల సేవా సమయంలో ఉప్పల్, ఉప్పల్ స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్లలో మాత్రమే మెట్రో ట్రైన్లలోకి ప్రవేశాలు అనుమతించబడుతాయని పేర్కొన్నారు. ఇక అక్కడ నుంచి అన్ని స్టేషన్లలో బయటకు వెళ్లడానికి ట్రైన్ తలుపులు తెరుచుకుంటాయని అధికారులు చెప్పారు.

రద్దీ ఎక్కువగా ఉండే కారణంగా మ్యాచ్ కోసం అడ్వాన్స్ గా మెట్రో టికెట్లు కొనుగోలు చేయొచ్చని తెలిపారు. క్యూలో నిలబడకుండా ఉండటానికి స్మార్ట్ కార్డులు ఉపయోగించుకోవాలని మెట్రో అధికారులు ప్రయాణికులను కోరారు.