బాచుపల్లిలో ఇద్దరు చిన్నారులను సంపులో పడేసి ఆత్మహత్యాయత్నం..చిన్నారులు మృతి..తల్లి సేఫ్

బాచుపల్లిలో ఇద్దరు చిన్నారులను సంపులో పడేసి ఆత్మహత్యాయత్నం..చిన్నారులు మృతి..తల్లి సేఫ్

చిన్నచిన్న గొడవలు, క్షణికావేశాలు కాపురాల్లో కలతలు సృష్టిస్తున్నాయి. భార్యాభర్తలు గొడవల వల్ల అభం శుభం తెలియని చిన్నారులు బలవుతున్నారు.  ఆవేశంతో  చిన్నారులను చంపి ఆత్మహత్య చేసుకుంటున్నారు తల్లిదండ్రులు. లేటెస్ట్ గా ఆగస్టు 20న హైదరాబాద్ బాచుపల్లిలో ఇలాంటి ఘటనే జరిగింది. భర్తతో  గొడవల  కారణంగా  ఇద్దరు చిన్నారులను నీటి సంపులో పడేసి తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంది ఓ తల్లి.

అసలేం జరిగిందంటే.. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మీ అనే మహిళ ఉంటుంది. కొన్ని రోజుల నుంచి తన భర్తతో గొడవలు జరుగుతున్నాయి. దీంతో   8 నెలలు,  మూడేళ్ల  వయస్సున్న ఇద్దరు చిన్నారులను ఇంటి ముందు సంపులో పడవేసి  ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనలో  ఇద్దరు చిన్నారులు  మృతి చెందగా తల్లి లక్ష్మీ ప్రాణాలతో బయటపడింది. 

►ALSO READ | రూ.15 లక్షల లోన్‌ ఇస్తామని... రూ.6.6 లక్షలు కాజేసిన్రు.. రిలయన్స్‌, ధని ఫైనాన్స్‌ పేరుతో మోసం

ఘటనా స్థలానికి వచ్చిన బాచుపల్లి పోలీసులు  పోస్టుమార్టం కోసం ఇద్దరు చిన్నారుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రి తరలించారు. లక్ష్మికి చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు  పోలీసులు. లక్ష్మీ ఆత్మహత్యాయత్నకు భార్యాభర్తల మధ్యగొడవలా? లేక ఇతర  కారణాలు ఏమైనా ఉన్నాయా తెలియాల్సి ఉంది. దీనిపై   కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు  బాచుపల్లి పోలీసులు