ప్రభుత్వ సంస్థలనూ కూల్చేస్తారా? హైడ్రాపై ఎంపీ అసదుద్దీన్ ఫైర్

ప్రభుత్వ సంస్థలనూ కూల్చేస్తారా? హైడ్రాపై ఎంపీ అసదుద్దీన్ ఫైర్
  • ఎఫ్​టీఎల్ ​పరిధిలో ఉన్న నెక్లెస్​ రోడ్​ను తొలగిస్తారా?
  • నాలాలపై కట్టిన జీహెచ్​ఎంసీ పరిస్థితి ఏంటీ?
  • గోల్ఫ్ ​కోర్టు కూడా ఎఫ్​టీఎల్​ పరిధిలోనే ఉంది
  • మేయర్​ను కలిసి ఫిర్యాదు చేస్తానని వెల్లడి

హైదరాబాదాద్, వెలుగు: ఎఫ్​టీఎల్​పరిధిలో నిర్మించిన ప్రభుత్వ సంస్థలను కూడా హైడ్రా కూల్చేస్తుందా? అని మజ్లిస్​ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్​ప్రశ్నించారు. హైదరాబాద్​లో కొన్ని గవర్నమెంట్​బిల్డింగులను ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌లోనే కట్టారని, వాటిపై కూడా చర్యలు తీసుకుంటారా?  అని అడిగారు.  ఆదివారం ఆయన వక్ఫ్​ చట్టంపై నిర్వహించిన మీడియా సమావేశంలో హైడ్రాపై ఆయన ఫైర్​అయ్యారు. 

‘‘హుస్సేన్ సాగర్​ ఎఫ్​టీఎల్​ పరిధిలో ఉన్న నెక్లెస్‌‌‌‌ రోడ్‌‌‌‌ను కూడా తొలగిస్తారా? సాక్షాత్తు జీహెచ్‌‌‌‌ఎంసీ హెడ్​ ఆఫీస్ ను కూడా నాలాపై నిర్మించారు. హిమాయత్​సాగర్​ ఎఫ్​టీఎల్​ పరిధిలో సీసీఎంబీ కట్టారు. గోల్కొండలో ఉన్న చెరువులో గోల్ఫ్ కోర్టు ఉంది. ఆ గోల్ఫ్ కోర్టులో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు గోల్ఫ్ ఆడుతారు. అక్కడికి వెళ్లి చూడండి.. లేదంటే ఫొటోలు కావాలంటే నేను ఇస్తాను. దానిని కూడా తొలగిస్తారా?”అని అసదుద్దీన్​ ప్రశ్నించారు. ఎఫ్‌‌‌‌టీఎల్ సమస్యపై జీహెచ్​ఎంసీ మేయర్‌‌‌‌ను కలిసి ఫిర్యాదు చేస్తానని, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూస్తానని అసదుద్దీన్ పేర్కొన్నారు.

ముస్లింలు లేకుండా చేయాలని బీజేపీ చూస్తోంది..

వక్ఫ్‌‌‌‌ బోర్డుకు వ్యతిరేకంగా బీజేపీ బిల్ ప్రవేశ పెడుతూ.. ముస్లింలు లేకుండా చేయాలని చూస్తోందని ఎంపీ అసదుద్దీన్​ఆరోపించారు. ‘‘మజీద్ లు, దర్గాల లాగే వక్ఫ్ ఆస్తులు కూడా ప్రభుత్వ ప్రాపర్టీ కాదు. ఎప్పటి నుంచో ఉన్న వక్ఫ్ ప్రాపర్టీలకు డీడ్ ఎలా ఉంటుంది. మక్కా మసీద్‌‌‌‌కు డీడ్ కావాలంటే ఎక్కడ తేవాలి’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. వక్ఫ్​ ప్రాపర్టీస్​ను ఖతం చేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 

మజ్లిస్​ పార్టీ ఆలిండియా పర్సనల్​ లా బోర్డ్ ప్రతినిధులతో కలిసి నాన్​ బీజేపీ సీఎంలను కలుస్తున్నామని తెలిపారు. ‘‘ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్​ను కలిశాం. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్​ను కలిశాం. బీజేపీ ఎన్డీయే గవర్నమెంట్​ వక్ఫ్​ అమెండ్​మెంట్​ బిల్లులో పొందుపరిచిన ప్రమాదకర అంశాలను  వక్ఫ్​ ప్రొవిజన్​లను వివరించాం. కేసీ వేణుగోపాల్​తో మాట్లాడి.. ఈ  క్లాజ్​ బై క్లాజ్ గురించి​చెప్పాం. ఈ విషయంలో మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ పార్టీ సెంట్రల్​ లీడర్లతో మాట్లాడతామని హామీ ఇచ్చారు”అని అసదుద్దీన్ ​తెలిపారు. వైఎస్సార్​ సీపీ పార్లమెంట్​లో ఆ బిల్లును వ్యతిరేకించిందన్నారు. 

ఆలిండియా పర్సనల్​ లా బోర్డ్​ ప్రతినిధులతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబును, బీహార్ సీఎం,​ చిరాగ్ పాశ్వాన్​ను కలిసి వక్ఫ్​ బిల్లుపై తమ వాదనలు వినిపిస్తామని చెప్పారు. మోదీ ప్రభుత్వం సెక్షన్​ 40లో అబ్యూస్​ అయితే అలాంటి వాటి ఉదాహరణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. ఆర్టికల్​25 26 ఉల్లంఘన జరుగుతోందని, భవిష్యత్తులో పబ్లిక్​ మీటింగ్​లు పెట్టి, ప్రతిపక్ష నేతలను కలిసి ఉద్యమిస్తామని అసదుద్దీన్​ వెల్లడించారు.