ఫుడింగ్ పబ్ కేసులో నిందితులకు పోలీసు కస్టడీ

ఫుడింగ్ పబ్ కేసులో నిందితులకు పోలీసు కస్టడీ
  • 4 రోజులు పోలీసు కస్టడీకి అనుమతించిన నాంపల్లి కోర్టు 

హైదరాబాద్: ఫుడింగ్ ఎండ్ మింక్ పబ్ కేసులో నిందితుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. నిందితులకు 4 రోజుల పోలీసు కస్టడీ అనుమతించింది నాంపల్లి కోర్టు. ఈనెల 12 నుంచి 15 వరకు పోలీస్ కస్టడీకి తీసుకోనున్నారు. పబ్ లో కొకైన్ దొరకడంతో పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. కేసులో ప్రధాన నిందితులైన అభిషేక్, అనిల్ కుమార్ చంచల్ గూడ జైలులో ఉన్నారు. వీరిపై నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ యాక్ట్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతివ్వడంతో విచారణలో కీలకం అని భావిస్తున్న బంజారాహిల్స్ పోలీసులు వాస్తవాలను వెలికితీసేయత్నం చేయనున్నారు. 

 

ఇవి కూడా చదవండి

కేసీఆర్ పచ్చి అబద్ధాలకోరు

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు

ఏపీ మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం

ఉద్యమకారులను సన్మానించలేదని ఏం చేశారంటే..