ఉద్యమకారులను సన్మానించలేదని ఏం చేశారంటే..

 ఉద్యమకారులను సన్మానించలేదని ఏం చేశారంటే..
  • రవీంద్రభారతి పూలే జయంతి వేడుకల్లో గందరగోళం
  • రాష్ట్రంలో పూలే జయంతిని ఘనంగా జరుపుతామని సీఎంవో ప్రకటన
  • మాటల్లో తప్పితే చేతల్లో కనిపించని వేడుకలు

హైదరాబాద్: రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి వేడుకల్లో గందరగోళం జరిగింది. అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ పెద్దలెవరూ కనిపించలేదు. పూలే జయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా పండుగగా చేసుకుంటామని.. జిల్లా కేంద్రాల్లో ఘనంగా జరుపుకుంటామని కేసీఆర్ చెప్పినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే ఆచరణలో మాత్రం వేడుకలు నామమాత్రంగా జరిగాయి. 

రాష్ట్రంలో ఎక్కడా కూడా మంత్రులు, ప్రజాప్రతినిధులు పూలే జయంతి వేడుకల్లో పాల్గొనలేదు. వేడుకలు మాటల్లో తప్పితే చేతల్లో ఎక్కడా కనిపించలేదని.. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆందోళనకు దిగారు బీసీ సంఘాల నేతలు. జయంతి ఉత్సవ కమిటీలో మహిళలకు అన్యాయం జరిగిందంటూ బీసీ సంక్షేమ సంఘం మహిళ జేఏసీ చైర్మన్ జయంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులకు కమిటీ చైర్మన్ ఇచ్చారని ఆరోపించారు. నిజమైన బీసీ నాయకులకు గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ ఉద్యమకారులకు సన్మానం చేయలేదని... ఎవరికివారే మొమెంటోలు , శాలువలు తీసుకెళ్లడంతో గందరగోళానికి దారి తీసింది.

 

ఇవి కూడా చదవండి

సురారం బస్​స్టాప్ వద్ద గ్యాస్​ పైపు లైన్​ లీకేజీ

కంప్లైంట్ ఇచ్చిన సారే.. బ్రిడ్జి దొంగతనం చేసిండు..

ఏపీ మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం

రామయ్య పట్టాభిషేకంలో గవర్నర్‌ను పట్టించుకోని అధికారులు