ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించారు. ఐదుగురు మంత్రులకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు. గత క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన జగన్ సొంత జిల్లా కడపకు చెందిన  అంజాద్ బాషకు ఈసారి కూడా ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించడమే కాకుండా గతంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ శాఖనే కట్టబెట్టారు. అలాగే మరో డిప్యూటీ సీఎం  రాజన్నదొర కు గిరిజన సంక్షేమ శాఖ.. ఇంకో డిప్యూటీ సీఎం  ముత్యాలనాయుడు కు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ.. మరో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు దేవాదాయశాఖ మంత్రిగా, నారాయణ స్వామికి ఎక్సైజ్ శాఖ బాధ్యతలు అప్పగించారు. 

మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కడప జిల్లాకు చెందిన అంజాద్ బాష, సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరామ్, ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, నారాయణస్వామి, విశ్వరూప్, తానేటి వనిత, సీదిరి అప్పలరాజులకు జగన్ క్యాబినెట్ లో  రెండోసారి మంత్రులుగా అవకాశం దక్కింది. 

అయితే కొత్త పీఆర్సీపై టీచర్లు అసంతృప్తిగా.. వ్యతిరేక గళం వినిపిస్తున్న తరుణంలో సీనియర్ మంత్రి బొత్స సత్యానారాయణకు విద్యాశాఖను అప్పగించగా.. గత క్యాబినెట్ లో విద్యాశాఖ చూసిన ఆదిమూలపు సురేష్ కు మున్సిపల్ శాఖ కేటాయించారు. కొత్త మంత్రులకు  కేటాయించిన శాఖల వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషించే ఆర్ధిక శాఖను గత క్యాబినెట్ లో చూసిన బుగ్గన రాజేంద్రనాథ రెడ్డికే తిరిగి అప్పగించారు. 


మంత్రులు - శాఖలు

ధర్మాన ప్రసాదరావు : రెవెన్యూశాఖ, రిజిస్ట్రేషన్

సీదిరి అప్పలరాజు : పశుసంవర్ధక శాఖ

బొత్స సత్యనారాయణ : విద్యాశాఖ

రాజన్న దొర : గిరిజన సంక్షేమశాఖ (డిప్యూటీ సీఎం)

గుడివాడ అమర్నాథ్ : పరిశ్రమల శాఖ

బూడి ముత్యాల నాయుడు : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి (డిప్యూటీ సీఎం)

దాడిశెట్టి రాజా (దాడిశెట్టి రామలింగేశ్వరరావు) : రోడ్లు మరియు భవనాల శాఖ (ఆర్ అండ్ బి)

పి.విశ్వరూప్ : రవాణా శాఖ

చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ :  బీసీ సంక్షేమ శాఖ, సమాచార శాఖ, సినిమాటోగ్రఫీ 

తానేటి వనిత : హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ

కారుమూరి వెంకట నాగేశ్వరరావు : పౌర సరఫరాల శాఖ

కొట్టు సత్యనారాయణ : దేవాదాయ శాఖ (డిప్యూటీ సీఎం)

జోగి రమేష్ : గృహ నిర్మాణ శాఖ

మెరుగు నాగార్జున : సాంఘిక సంక్షేమ శాఖ

విడుదల రజని : వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య

అంబటి రాంబాబు : జల వనరుల శాఖ

ఆదిములపు సురేష్ : మునిసిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ

కాకాని గోవర్ధన్ రెడ్డి : వ్యవసాయ శాఖ, సహకార శాఖ, మార్కెటింగ్ శాఖ

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : విద్యుత్, అటవీశాఖ, గనులు భూగర్భ శాఖ

ఆర్.కె.రోజా : టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ

కె.నారాయణ స్వామి : ఎక్సైజ్ శాఖ (డిప్యూటీ సీఎం)

షేక్ అంజాద్ బాషా : మైనార్టీ సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)

బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి: ఆర్ధిక మరియు ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవశారాలు, స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ట్రైనింగ్

ఉష శ్రీ చరణ్ : మహిళా శిశు సంక్షేమ, సీనియర్ సిటిజన్ల సంక్షేమం

గుమ్మనూరు జయరాం : కార్మిక, ఉపాధి కల్పన శాఖ

 

 

ఇవి కూడా చదవండి

ఏపీ మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం

ఉద్యమకారులను సన్మానించలేదని ఏం చేశారంటే..

సురారం బస్​స్టాప్ వద్ద గ్యాస్​ పైపు లైన్​ లీకేజీ

కంప్లైంట్ ఇచ్చిన సారే.. బ్రిడ్జి దొంగతనం చేసిండు..