బోధన్, వెలుగు : మున్సిపల్ ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించాలని ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు సూచించారు. సోమవారం బోధన్ పట్ణణంలోని రాకాసిపేట్ లయన్స్ సమావేశం హాల్లో పీవోలు, ఏపీవోలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ పోలింగ్, ఓట్ల లెక్కింపు జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు.
ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలు చేయాలన్నారు. అనంతరం విజయమేరి స్కూల్ లో స్ట్రాంగ్ రూంను పరిశీలించి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఈవో అశోక్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విఠల్ పాల్గొన్నారు.
