
కరోనా వల్ల రెండేళ్లు వాయిదా పడిన నుమాయిష్ సందడి మళ్లీ మొదలు కానుంది. జనవరి 1 నుంచి 45 రోజుల పాటు జరగనుంది. దేశంలో జరిగే అతి పెద్ద ఎగ్జిబిషన్లలో ఇది ఒకటి కావడంతో షాపింగ్ కోసం భారీగా జనం వస్తారు. లోకల్, నేషనల్ బ్రాండెడ్ వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. సిటీ జనంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి విజిటర్స్ వస్తారు. ఎగ్జిబిషన్ కు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని సొసైటీ నిర్వాహకులు వెల్లడించారు. ఒక స్టాల్ కు మరో స్టాల్ మధ్య గ్యాప్ ఉండేలా రోడ్డు వెడల్పు చేస్తున్నామన్నారు.
20 లక్షల మంది..
స్టాల్స్ కోసం ఇప్పటికే 2వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. ఇందులో నుంచి 1700 స్టాల్స్ ను ఎంపిక చేశారు. ఈసారి కాశ్మీర్, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీకి చెందిన వ్యాపారులు స్టాల్స్ పెట్టుకోవడానికి ఆసక్తి చూపించారు. ఈసారి నుమాయిష్ కు 20 లక్షల మంది రానున్నట్లు అంచనా వేస్తున్నారు. టికెట్ రేటు ఐదు రూపాయలు పెంచామని సొసైటీ నిర్వాహకులు వెల్లడించారు.
ఫ్రీ వైఫై సౌకర్యం..
ఎగ్జిబిషన్ లో స్టాల్స్ ను ఇన్ టు బ్లాక్స్ గా డివైడ్ చేశారు నిర్వాహకులు. ఎక్కడా మట్టి లేకుండా చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ కు ఇబ్బందులు రాకుండా ఫ్రీ వైఫై సౌకర్యం కల్పిస్తున్నారు. సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్, సండే స్పెషల్ ఈవెంట్స్ ఉంటాయన్నారు. గతం కంటే ఈసారి బాగా బిజినెస్ జరుగుతుందని చెపుతున్నారు.
స్పెషల్ ఫుడ్ కోర్ట్స్..
నుమాయిష్ ఎగ్జిబిషన్ లో తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవాలని వ్యాపారులు భావిస్తారు. మంచి సేల్స్ తో పాటు బ్రాండింగ్ అవుతుందని అనుకుంటారు. స్టాల్స్ ఓనర్స్ తో పాటు అందులో పని చేసే సేల్స్ పర్సన్స్. స్టాల్ నిర్మాణ కూలీలంతా సీజన్ కోసం ఎదురుచూస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. నుమాయిష్ లో ఈసారి స్పెషల్ ఫుడ్ కోర్ట్స్ కనిపించబోతున్నాయి. అయితే ఫుడ్ రేట్స్ కంట్రోల్ లో ఉంటాయంటున్నారు.