నర్సరీ మేళాకు ఫుల్ రష్

నర్సరీ మేళాకు ఫుల్ రష్

హైదరాబాద్, వెలుగు: నెక్లెస్  రోడ్‌‌‌‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహిస్తున్న నర్సరీ మేళా సందర్శకులను ఆకట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన అరుదైన మొక్కలు,  ఔషధ మొక్కలు, అలంకార మొక్కలు, విదేశీ పండ్ల రకాలు, పూల మొక్కలను ఇక్కడ స్టాల్స్‌‌‌‌లో  ప్రదర్శిస్తున్నారు. 

ఇండోర్, అవుట్‌‌‌‌డోర్  మొక్కలు, బోన్సాయ్, క్రీపర్స్, వాటర్  లిల్లీస్, ఎగ్జాటిక్  ప్లాంట్స్, కోకోపీట్, గార్డెన్ పరికరాలు, పూల కుండీలు, స్టాండ్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఏపీ, కోల్‌‌‌‌కతా, ఢిల్లీ, హర్యానా, కడియం, చెన్నై, వెస్ట్ బెంగాల్  నుంచి పూలమొక్కలను తెచ్చారు. బెంగాల్‌‌‌‌లోని కాలీపంగ్  నుంచి తీసుకొచ్చిన ఎగ్జాటిక్  ప్లాంట్స్ స్టాల్  ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.