ఆగస్టు 27 నుంచి నర్సరీ మేళా..హెచ్‌‌‌‌ఎండీఏ గ్రౌండ్‌‌‌‌లో ఐదు రోజుల పాటు ప్రదర్శన

ఆగస్టు 27 నుంచి  నర్సరీ మేళా..హెచ్‌‌‌‌ఎండీఏ గ్రౌండ్‌‌‌‌లో ఐదు రోజుల పాటు ప్రదర్శన

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గ్రీనరీ ప్రియులకు  20వ గ్రాండ్ నర్సరీ మేళా అందుబాటులోకి వస్తోంది. ఆల్‌‌‌‌ ఇండియా హార్టికల్చర్‌‌‌‌ అండ్‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌ షోగా నిర్వహించే ఈ మేళా ఆగస్టు 27 నుంచి 31వరకు ఐదు రోజులపాటు హెచ్‌‌‌‌ఎండీఏ గ్రౌండ్‌‌‌‌లో, ఐమ్యాక్స్‌‌‌‌ థియేటర్‌‌‌‌ సమీపంలో జరగనుందని నర్సరీ మేళా ఇన్​చార్జి ఖలీద్ అహ్మద్  తెలిపారు. మేళాలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 100కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వివిధ రకాల పూలు, అలంకరణ మొక్కలు, పండ్లు, కూరగాయల మొక్కలు, నర్సరీ మొక్కలు, వివిధ రకాల కుండీలు, కంపోస్ట్‌‌‌‌ ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి. 

ఇంటివద్ద, బాల్కనీలు, టెర్రస్‌‌‌‌ గార్డెన్లలో మొక్కల పెంపకంపై ఆసక్తి ఉన్న వారికి మేళా ఉపయోగకరంగా ఉండనుంది. పూల మొక్కలు, ఇండోర్‌‌‌‌ ప్లాంట్లు, సక్యూలెంట్స్‌‌‌‌, పండ్ల మొక్కలు తదితరాలను ఒకే వేదికపై కొనుగోలు చేసే అవకాశం కల్పించనున్నారు. మొక్కల పెంపకం, ఉద్యానవనం, వ్యవసాయంపై ఆసక్తి ఉన్న ప్రజలు మేళాను సందర్శించాలని ఖలీద్ అహ్మద్  కోరారు.