ప్రయాణికుల రద్దీ... టోల్ గేట్ల వద్ద బారులు తీరిన వాహనాలు

ప్రయాణికుల రద్దీ... టోల్ గేట్ల వద్ద బారులు తీరిన వాహనాలు

దసరా పండుగ సెలవులతో CBS, JBS బస్టాండ్స్ జనంతో రద్దీగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కొన్ని జిల్లాలకు బస్సుల్లేక గంటల తరబడి జనం బస్టాండ్లలో వెయిట్ చేస్తున్నారు. అదనపు బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ బస్సులు సరిపోవడం లేదనీ... మరో వారంపాటు బస్సుల సంఖ్య పెంచాలంటుని జనం అంటున్నారు. 

సద్దుల బతుకమ్మ, దసరా పండుగ కోసం హైదరాబాద్ జనం ఊళ్ళకి వెళ్తున్నారు. దాంతో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. వివిధ రాష్ట్రాలకు వెళ్లేవారు కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు భారీగా వస్తున్నారు. జనం రద్దీ ఎక్కువగా ఉండటంతో సౌత్ సెంట్రల్ రైల్వే అదనంగా రైళ్లు వేసింది. ఇవాళ్టి నుంచి 15 రోజుల పాటు ఈ స్పెషల్ రైళ్ళు నడవనున్నాయి. కొన్ని కాచిగూడ, నాంపల్లి స్టేషన్ నుంచి కూడా నడపనుంది. 

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహాదారిపై ట్రాఫిక్ కొనసాగుతోంది. స్కూళ్లకు దసరా సెలవులు ఇవ్వడంతో.. జనం సొంతూర్ల బాట పట్టారు. దీంతో పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ ఉంటోంది. ఫాస్టాగ్ ఉన్న వాహనాలు ఫ్రీగానే మూవ్ అవుతున్నా.. ఫాస్టాగ్ లేని వాటిని పక్కకు ఆపుతున్నారు. వాటి పేమెంట్స్ తొందరగా కాకపోవడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ పండగ కోసం జనం ఒక్కసారి ఊళ్లకు వెళ్తుండంతో వాహనాలు కాస్త నెమ్మదిగా కదులుతున్నాయి.