
హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. పికిల్ బాల్‌లోకి అడుగుపెట్టింది. హైదరాబాద్ పికిల్ బాల్ (హెచ్‌పీఎల్) లీగ్‌లో కీర్తి వారియర్స్ జట్టుకు ఆమె కో ఓనర్‌గా వ్యవహరించనుంది. గ్రామీణ స్థాయిలో పికిల్ బాల్‌ను ప్రోత్సహించడం, ఆటను అభివృద్ధి చేయాలనే కోరికతోనే ఇందులోకి వచ్చినట్లు తెలిపింది.
‘నా దృష్టిలో, క్రీడ అంటే కేవలం ఆడటం మాత్రమే కాదు, అంతకు మించి ప్రజలను ఉత్తేజపరచడం, కొత్త ప్రతిభావంతులకు సరైన దారి చూపించడం. నాకు తెలిసినంత వరకు క్రీడకు ఇంతకు మించిన పెద్ద లక్ష్యం ఏదీ ఉండదు. ఎందుకంటే, క్రీడ ఒకరి జీవితాన్ని పూర్తిగా మార్చివేసే శక్తిని కలిగి ఉంటుంది’ అని సైనా పేర్కొంది.