పాతబస్తీలో పోలీసు బలగాల మొహరింపు

 పాతబస్తీలో పోలీసు బలగాల మొహరింపు

హైదరాబాద్ పాతబస్తీలో పోలీసు బలగాలు మొహరిస్తున్నారు.  అక్బరుద్దీన్ విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో ఇవాళ కోర్టు తుది తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలను మొహరించారు. తొమ్మిదేళ్ల క్రితం నమోదైన కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు వెలువరించనున్న తీర్పుపై ఉత్కంఠ ఏర్పడింది. అక్బరుద్దీన్ పై ఐపీసీ 120- బీ, 153 ఏ, 295, 298, 188 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘంగా సాగిన కేసు విచారణలో 38మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. 
కీలకం కానున్న ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్
అక్బరుద్దీన్ కేసులో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో గతంలో అరెస్టయిన అక్బరుద్దీన్ 40 రోజుల పాటు జైల్లో ఉన్నారు. తొమ్మిదేళ్ల సుదీర్ఘ వాదనలు విన్న ప్రజా ప్రతినిధుల కోర్టు ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది. కోర్టు తీర్పు వల్ల ఉద్రిక్త పరిస్థితులను నివారించేందుకు పోలీసులు తొమ్మిది సెన్సిటివ్ ఏరియాలుగా గుర్తించి బలగాలను మొహరించారు. చార్మినార్, మక్కా మస్జీద్, చాంద్రాయణగుట్ట వద్ద పరిస్థితిని పోలీస్ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. నాలుగు ప్లాటున్ల బలగాలతో భద్రత ఏర్పాట్లు చేవారు. ఎలాంటి తీర్పు వెలువడినా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. పోలీసు బలగాల మొహరింపు నేపథ్యంలో ఉత్కంఠ ఏర్పడినా  ప్రస్తుతానికి పాతబస్తీ అంతా  ప్రశాంతంగా ఉంది. 

 

 

ఇవి కూడా చదవండి

ప్రభుత్వంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి

ప్రభుత్వ తీరుపై గవర్నర్కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

ఏపీలో రేషన్ కార్డు దారులకు శుభవార్త

మహిళల భద్రత కోసం కర్ణాటకలో నెలంతా సేఫ్టీ రైడ్

జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కొలరెక్టల్‌‌ క్యాన్సర్‌‌‌‌!