
ఆంధ్రా మాజీ రంజీ క్రికెటర్ నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి కేటీఆర్ పీఏ అంటూ మోసాలు చేస్తున్న మోసగాడిని సోమవారం సాయంత్రం హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఇంతకు ముందు కూడా అనేక కేసులు నమోదైయ్యాయి. డ్రగ్స్ ఫార్మా కంపెనీల దగ్గర డబ్బు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. పొల్యూషన్ బోర్డ్ నోటీసులు ఇవ్వకుండా చూస్తానని రూ.15 లక్షలు స్వాహా చేసినట్లు ఇది వరకే కేసు నమోదైంది. అంతేకాకుండా నాగరాజుపై గతంలో ఏపీ, తెలంగాణలో పలు కేసులు నమోదయ్యాయి.ఇప్పుడు మంత్రి కేటీఆర్ పేరు చెప్పి మోసానికి పాల్పడటంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేటకు చెందిన నాగరాజు పూర్తిపేరు బుడమూరి నాగరాజు. ఎంబీయే వరకు చదువుకున్న నాగరాజు బాల్యం నుంచి క్రికెట్ లో ఎంతో ప్రతిభచూపేవాడు. 2006లో అండర్-14 విశాఖ జట్టుకు ఎంపికై సత్తా చాటాడు. అయితే జల్సాలకు అలవాటు పడిన నాగరాజు మోసాలు చేయడం ప్రారంభించాడు.