బస్టాండ్లు, మెట్రో స్టేషన్లలో హైదరాబాద్ పోలీసుల డెకాయ్ ఆపరేషన్లు.. 15 రోజుల్లో 110 మంది పోకిరీలు అరెస్ట్..

బస్టాండ్లు, మెట్రో స్టేషన్లలో హైదరాబాద్ పోలీసుల డెకాయ్ ఆపరేషన్లు.. 15 రోజుల్లో 110 మంది పోకిరీలు అరెస్ట్..

హైదరాబాద్ లోని బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, కాలేజీలు, పబ్లిక్ ప్రదేశాల్లో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు. ఈ క్రమంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ.. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టమని అన్నారు. 15 రోజులుగా జరిగిన ఈ ఆపరేషన్ లో 110 మంది పోకిరీలు పట్టుబడ్డట్టు తెలిపారు. పట్టుబడ్డవారిలో 74 మంది మేజర్లు కాగా.. 36 మంది మైనర్లు ఉన్నట్లు సమాచారం. పట్టుబడ్డవారిని సాక్ష్యాలతో కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు సీపీ సుధీర్ బాబు.

నవంబర్ 1 నుండి 15 తేదీల్లో మొత్తం 135 ఫిర్యాదులు వచ్చాయని.. ఫోన్ ద్వారా 34, సోషల్ మీడియా ద్వారా 48, నేరుగా 53 ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. ప్రయాణికురాలిపై దాడి కేసులో ఉబర్ ఆటో డ్రైవర్ ను అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు పెట్టినట్లు తెలిపారు. సోష‍ల్ మీడియా వేధింపుల కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేశామని.. వేరే ఫోన్ నంబర్లతో యువతిని వేధించిన కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామని తెలిపారు.

ఈ ఆపరేషన్ లో భాగంగా 49 అవగాహన కార్యక్రమాలు  7,481 మందికి మహిళా హక్కులు, జాగ్రత్తలపై అవగాహన కల్పించామని తెలిపారు సుధీర్ బాబు.మెట్రో రైళ్లలో డెకాయ్ ఆపరేషన్ లో భాగంగా మహిళా కంపార్ట్‌మెంట్‌లోకి వచ్చి ప్రయాణించిన 8 మందికి ఫైన్ వేసినట్లు తెలిపారు. మహిళలు భయపడకుండా ఫిర్యాదు చేయాలని... షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 8712662111 కి ఫోన్ లేదా మెసేజ్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు సీపీ సుధీర్ బాబు.