క్వార్టర్, హాఫ్, బీర్... ఏం కావాలన్నా సంచిలోనే ఉన్నాయి.. బోరబండలో మద్యం అమ్ముతున్న మహిళలు అరెస్ట్..

క్వార్టర్, హాఫ్, బీర్... ఏం కావాలన్నా సంచిలోనే ఉన్నాయి.. బోరబండలో మద్యం అమ్ముతున్న మహిళలు అరెస్ట్..

హైదరాబాద్ లో ఎన్నికల సందడి మొదలైంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగనున్న క్రమంలో సిటీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రధాన పార్టీలన్నీ జూబ్లీహిల్స్ స్థానం కైవసం చేసుకోవడంపైనే ఫోకస్ పెట్టారు. ఉపఎన్నికకు సంబందించిన నోటిఫికేషన్ కూడా వెలువడిన క్రమంలో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని బోరబండలో మద్యం అమ్ముతున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బుధవారం ( అక్టోబర్ 15 ) STFB టీమ్‌  సీఐ బిక్షారెడ్డి ఎస్సై బాలరాజు సిబ్బంది కలిసి పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. 

ఈ తనిఖీల్లో బోరబండలోని ఇందిరానగర్ లో మద్యం అమ్ముతున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈశ్వరమ్మ, మరియా అనే ఇద్దరు మహిళలు సంచుల్లో మద్యం బాటిళ్లు పెట్టుకొని మద్యం అమ్ముతుండగా పట్టుకున్నారు పోలీసులు.

క్వార్టర్, హాఫ్ బాటిళ్లు, బీర్ బాటిళ్లు సంచుల్లో పెట్టుకొని ఏమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. మహిళల దగ్గరున్న సంచుల్లో నుంచి 173 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 

పోలీసులు స్వాధీనం చేసుకున్న బాటిళ్లలో పలు బ్రాండ్లకు సంబంధిచిన క్వార్టర్, హాఫ్ బాటిళ్లు, బీర్ బాటిళ్లు ఉన్నట్లు తెలిపారు పోలీసులు.ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన ఎక్సయిజ్ పోలీసులు మద్యం బాటిళ్లతో సహా అమీర్ పేట్ ఎక్సయిజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.