చర్లపల్లి జైలుకు మోస్ట్ వాంటెడ్ చైన్ స్నాచర్

చర్లపల్లి జైలుకు మోస్ట్ వాంటెడ్ చైన్ స్నాచర్

మూడు కమిషనరేట్ల పరిధిలో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడిన మోస్ట్ వాంటెడ్ చైన్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ను పేట్ బషీరాబాద్ పోలీసులు హైదరాబాద్కు తీసుకొచ్చారు. గుజరాత్లోని సబర్మతి జైల్ నుంచి పీటీ వారెంట్పై సిటీకి తరలించారు. నెల రోజుల క్రితం అహ్మదాబాద్ క్రైం టీం పోలీసులు ఉమేష్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఒకేరోజు సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిథిలో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డ ఉమేష్ ఖతిక్.. బెంగళూరు, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న అతన్ని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ఉమేష్ స్వస్థలం రాజస్థాన్లోని పాలి జిల్లా ఛనోడ్ గ్రామం. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ వచ్చిన నిందితుడు అదే రోజు మెహదీపట్నంలో యాక్టివా వెహికిల్ చోరీ చేశారు. మరుసటి రోజు ఉదయం ఆల్వాల్ నుంచి మేడిపల్లి వరకు స్నాచింగ్లకు పాల్పడి దాదాపు 18 తులాల బంగారం కొట్టేశాడు. 24గంటల్లోనే నిందితున్ని గుర్తించిన హైదరాబాద్ పోలీసులు.. ఉమేష్ అహ్మదాబాద్లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడి అధికారులకు సమాచారమిచ్చారు. తాజాగా పీటీ వారెంట్పై హైదరాబాద్కు తీసుకొచ్చారు.