వాట్సప్ గ్రూప్ అడ్మిన్‌లకు పోలీస్ కమిషనర్ వార్నింగ్

వాట్సప్ గ్రూప్ అడ్మిన్‌లకు పోలీస్ కమిషనర్ వార్నింగ్

కశ్మీర్ వీడియోలంటూ వాట్సప్ లో వైరల్ 

అవి ఇక్కడివి కావన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్

గ్రూప్ లలో సర్క్యులేట్ అయితే అడ్మిన్స్‌దే బాధ్యతన్న సీపీ

ఫేక్ న్యూస్ ప్రచారంపై వాట్సప్ అడ్మిన్ లకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వార్నింగ్ ఇచ్చారు.  కశ్మీర్ లో ఇలా జరుగుతోందంటూ కొన్నిరోజులుగా వాట్సప్ లో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఇవాళ స్పందించారు. వాట్సప్ గ్రూప్ అడ్మిన్స్ కు హెచ్చరికలు చేశారు. ఆ వీడియోలు వేరే దేశాలకు చెందినవనీ… కశ్మీర్ కు సంబంధించినవి కావని అన్నారు.

“గడిచిన రెండు రోజులుగా పాత వీడియోలను వాట్సప్ గ్రూప్ లలో ప్రచారం చేస్తున్నారు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాలస్తీనాకు చెందిన వీడియోలను ఎడిట్ చేసి వార్తలుగా సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారు. వాటితో కశ్మీర్ కు ఎటువంటి సంబంధం లేదు. ఫేక్ న్యూస్, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాంటి ఫేక్ వీడియోలు తమ గ్రూప్ లో పోస్టుకావడం.. అక్కడినుంచి మరో చోటకు ఫార్వర్డ్ కాకుండా అడ్మిన్స్ చర్యలు తీసుకోవాలి. లేకపోతే.. వాట్సప్ గ్రూప్ అడ్మిన్స్ పై చర్యలు తప్పనిసరిగా ఉంటాయి. మార్ఫింగ్ చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయకూడదు” అని అంజనీకుమార్ చెప్పారు.