అనుమతి లేదు.. సెక్రటేరియట్ దగ్గర ఎమ్మెల్యే సీతక్కకు అవమానం..

అనుమతి లేదు.. సెక్రటేరియట్ దగ్గర ఎమ్మెల్యే సీతక్కకు అవమానం..

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ సెక్రటేరియట్ లోకి ఆమెను వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. గేటు వద్దనే సీతక్కను ఆపేశారు. తాను ఎమ్మెల్యేనని..సెక్రటేరియట్ లోకి వెళ్లే హక్కు ఉందని చెప్పినా..పోలీసులు వినలేదు. 

పోలీసుల తీరుపై ఎమ్మెల్యే సీతక్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేనని చెప్పినా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. చేసేది లేక..తన వాహనాన్ని సెక్రటేరియట్ ప్రధాన గేటు దగ్గరే ఆపేసి నడుచుకుంటూ లోపలికి వెళ్లిపోయారు.