బంపరాఫర్ : కార్లు, బైక్ చలాన్లపై భారీ డిస్కౌంట్

బంపరాఫర్ : కార్లు, బైక్ చలాన్లపై భారీ డిస్కౌంట్

మీ బైక్ పై చలాన్లు ఉన్నాయా.. మీ కార్లపై చలాన్లు ఉన్నాయా.. వేలకు వేల రూపాయలు ఎలా కట్టాలని బాధపడుతున్నారా.. డోంట్ వర్రీ.. అలాంటి వారి కోసం తెలంగాణ ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ స్కీం తీసుకొచ్చింది. భారీ డిస్కొంట్ తో పెండింగ్ చలాన్లు చెల్లించొచ్చని ప్రకటించింది ప్రభుత్వం. 

2023, డిసెంబర్ 26వ తేదీ నుంచి డిస్కొంట్ కింద పెండింగ్ చలాన్లు కట్టే అవకాశాన్ని కల్పిస్తుంది. ఆర్టీసీ  డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90 శాతం డిస్కొంట్ ఇచ్చింది. వంద రూపాయలకు పది రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అదే విధంగా టూ వీలర్స్.. బైక్స్ పై 80 శాతం డిస్కొంట్.. అంటే వెయ్యి రూపాయల చలాను అసలు ఉంటే.. డిస్కొంట్ కింద 200 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.

ఇక కార్లు, ఆటోలపై 60 శాతం డిస్కౌంట్.. వెయ్యి రూపాయలు ఉంటే 400 రూపాయల చలానా చెల్లిస్తే సరిపోతుంది. లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్ కి 50 శాతం డిస్కౌంట్ ఇస్తుంది సర్కార్. ఆన్ లైన్ తో పాటు మీ సేవ సెంటర్స్ లో డిస్కౌంట్ లో చలాన్స్ పేమెంట్ చేయొచ్చు. 2022 లో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 300 కోట్ల చలాన్స్ వసూలు అయ్యింది. ఆ తర్వాత జనరేట్ అయిన చలానాలు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి.. వందల కోట్ల రూపాయల విలువైన చలాన్లు కట్టాల్సి ఉంది వాహనదారులు.