
యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ.. ఇళ్లలో దొంగతనాలు, బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. జన సంచారం తక్కువ ఉన్న ప్రాంతాలనే టార్గెట్ చేస్తున్న ముఠా సభ్యుల్లో ఆరుగురిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. హైదరాబాద్ సీపీ ఈ అరెస్ట్ గురించి మాట్లాడుతూ.. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్, సంగారెడ్డి లలోని పలు ప్రాంతాల్లో ఈ ముఠా నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. నిందితుల పై మర్డర్ కేసులు కూడా ఉన్నాయని, ఇద్దరు రిసీవర్ లను కూడా అరెస్ట్ చేశామన్నారు. 26 ఇళ్ల చోరీ కేసులను చేధించామని, రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 23 బైకులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితులపై పీడి యాక్ట్ నమోదు చేస్తామని సీపీ తెలిపారు