- హుస్సేన్ సాగర్‌లో యువతి డెడ్ బాడీ
ట్యాంక్ బండ్, వెలుగు: హుస్సేన్ సాగర్‌లో గుర్తు తెలియని యువతి డెడ్‌బాడీ లభ్యమైంది. ఆదివారం సాయంత్రం అమరవీరుల జ్యోతి స్తూపం వెనకాల సాగర్ నీటిపై తేలియాడుతున్న యువతి మృతదేహాన్ని సందర్శకులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని యువతి మృతదేహాన్ని బయటకు తీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు.
యువతి వయసు 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉంటుందన్నారు. యువతికి సంబంధించిన సమాచారం ఏదైనా తెలిస్తే లేక్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.
గండిపేట: శంకర్‌పల్లి వైపు గండిపేట చెరువులోనూ ఓ వ్యక్తి డెడ్‌బాడీ లభ్యమైంది. స్థానికుల సమచారంతో 50 నుంచి 60 ఏండ్ల మధ్య ఉన్న వ్యక్తి డెడ్‌బాడీని పోలీసులు వెలికితీశారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు.
