పోలీస్ శాఖలో ఎస్పీఓ పోస్టులు...దరఖాస్తులకు ఆహ్వానం

పోలీస్ శాఖలో ఎస్పీఓ పోస్టులు...దరఖాస్తులకు ఆహ్వానం

బషీర్​బాగ్, వెలుగు:  హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోని క్లూస్ టీమ్​లో తాత్కాలిక ప్రాతిపదికన 17 స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ (ఎస్పీఓ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సీఎఆర్ హెడ్‌‌క్వార్టర్స్ అండ్ ట్రైనింగ్ డీసీపీ ఒక ప్రకటనలో తెలిపారు. ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ విభాగాల్లో జరిగే ఈ నియామకాలకు తెలంగాణకు చెందిన మాజీ సైనికులు (వయస్సు 58 ఏళ్ల లోపు), గత రెండేళ్లలో పదవీ విరమణ పొందిన మాజీ పారామిలిటరీ, పోలీస్ సిబ్బంది (గరిష్ట వయస్సు 62 ఏళ్లు) అర్హులని, వారికి ఫొటోగ్రఫీ/వీడియోగ్రఫీలో సాంకేతిక పరిజ్ఞానం, అనుభవం తప్పనిసరి అని పేర్కొన్నారు. 

ఎంపికైన వారికి నెలకు రూ.26,000 గౌరవ వేతనం చెల్లిస్తామని, వీరికి ఎలాంటి సెలవులు వర్తించవని, లీవ్ పెడితే ఆ రోజు వేతనం మినహాయించబడుతుందని స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు డిశ్చార్జ్ బుక్/రిటైర్మెంట్ ఆర్డర్, ఆధార్, పాన్ కార్డు, ఎస్‌‌బీఐ బ్యాంక్ పాస్‌‌బుక్ జిరాక్స్, ఓటర్ ఐడీ, కుల ధ్రువీకరణ పత్రం, మూడు పాస్​పోర్ట్ సైజు ఫొటోల ఒరిజినల్స్, జిరాక్స్ ప్రతులతో హైదరాబాద్ పెట్లబుర్జ్​లోని కార్ హెడ్​క్వార్టర్స్ లో ఉన్న ఎస్పీఓ కార్యాలయాన్ని వ్యక్తిగతంగా సందర్శించి, ఈ నెల 20 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.