
హైదరాబాద్సిటీ, వెలుగు: సిటీ పరిధిలోని అన్ని పెట్రోలింగ్, పోలీస్వెహికల్స్కు మెరుగులు దిద్దనున్నారు. సిటీ సీపీ సీవీ ఆనంద్ఆదేశాల మేరకు 188 పోలీస్వెహికల్స్ను సిటీలోని ఆర్మ్ పోలీస్హెడ్క్వార్టర్స్కు తరలించారు. ఇప్పటికే ఆ వాహనాలపై ఉన్న పాత పోలీస్ స్టిక్కర్లను తొలగించి కొత్త స్టిక్కర్లు అంటించారు.
రిపేర్ల కోసం రూ.1.6 కోట్లు కేటాయించారు. మెషిన్ పాలిషింగ్, బంపర్లు, డోర్లు, ప్యానెళ్లపై డెంటింగ్, పెయింటింగ్, ఇంజిన్ రిపేర్లు, ఇంటర్నల్హార్డ్వేర్పనులు చేసి వాహనాలు పూర్తిస్థాయిలో కండిషన్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే 134 పెట్రోలింగ్వాహనాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు.
నేటి హైడ్రా ప్రజావాణి వాయిదా
హైదరాబాద్సిటీ, వెలుగు: ప్రతి సోమవారం హైడ్రా నిర్వహించే ప్రజావాణి వాయిదా వేసినట్టు అధికారులు తెలిపారు. సోమవారానికి బదులుగా మంగళవారం నిర్వహించనున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. చెరువులు, కుంటలు, పార్కుల ఆక్రమణలపై బుద్ధ భవన్లో ప్రజావాణి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
అనివార్య కారణాల వల్ల ఈ సారి సోమవారానికి బదులు మంగళవారం హైడ్రా ప్రజావాణి జరుగుతుందని తెలిపారు. వచ్చే వారం నుంచి యాధావిధిగా ప్రజావాణి జరుగుతుందన్నారు.