పోలీస్ అలర్ట్ : గణేష్ విగ్రహ వివరాలు ఆన్ లైన్లో నమోదు చేయండి

పోలీస్ అలర్ట్ : గణేష్ విగ్రహ వివరాలు ఆన్ లైన్లో నమోదు చేయండి

గణేష్ విగ్రహ వివరాలు ఆన్ లైన్లో నమోదు చేసుకోవాలని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. గణేశ్ మండపాల ఏర్పాటుకు సంబంధించిన వివరాలన్ని సెప్టెంబర్ 14 లోపు అప్లై చేయసుకోవాలని సూచించారు. పోర్టల్ లో policeportal.tspolice.gov.in/index.htm అనే వెబ్ సైట్ ద్వారా మండపాల వివరాలు ఇవ్వాలని పేర్కొన్నారు. 

భాగ్యనగర్ గణేశ్​ఉత్సవ కమిటీ సూచనల మేరకు ఈ సారి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ఇంటిమేషన్ అప్లికేషన్ల అనే కొత్త రూల్స్ ను అందుబాటులోకి తెచ్చారు. మండపం వద్ద పూర్తి వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో మండపాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేకున్నా సమాచారం మాత్రం తప్పనిసరి అనే కండిషన్ పెట్టారు. డీజేలకు మాత్రం అనుమతులు లేవు. 

ఇలా అప్లై చేసుకోవాలి..

  • policeportal.tspolice.gov.in/index.htm అనే వెబ్ సైట్ లోకి వెళ్లాలి. 
  • నిర్వాహకుల కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌ నంబర్స్‌ నమోదు చేయాలి.
  • మండపం ఏర్పాటు చేస్తున్న ఏరియా, కాలనీ పేరు ఎంటర్ చేయాలి.
  • ఎన్నిరోజులకు నిమజ్జనం చేస్తారనే వివరాలు నింపాల్సి ఉంటుంది.
  • పోలీసుల నుంచి ఎలాంటి సర్వీస్​ కావాలో కూడా అందులో పేర్కొనాలి.   

ప్రతి మండపంపై ఫోకస్

మండపాల ఏర్పాటుకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ఇంటిమేషన్ ఫామ్ తోపాటు పీఎస్‌‌‌‌‌‌‌‌లో అప్లికేషన్స్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులో ఉంచామని పోలీసులు తెలిపారు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే.. మండప నిర్వాహకులకు క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ ఇస్తామని పేర్కొన్నారు. విగ్రహాలు పెట్టిన మూడో రోజు నుంచి ఫీల్డ్ ఆఫీసర్లు సందర్శిస్తారు. అవసరమైన బారికేడ్లు, సీసీ టీవీలు, భక్తుల క్యూ- మెయింటెనెన్స్, ట్రాఫిక్  నియంత్రణ వంటి అవసరాలను గుర్తించి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. 

చివరగా నిమజ్జనం కోసం చర్యలు తీసుకుంటాంమని.. ఈ ప్రక్రియ అంతా ఐదు దశలుగా విభజించి పూర్తి చేస్తామన్నారు. దీనివల్ల ప్రతి మండపంపై ఫోకస్ ఉంటుందని వివరించారు.