
కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అల్లర్ల దృష్ట్య పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో రాత్రి 10:30 గంటలకు వ్యాపార సముదాయాలు మూసివేయాలని ఆదేశించారు పోలీసులు.వరుస ఘటనలతో గస్తీని పెంచాలని పోలీస్ యంత్రంగం నిర్ణయించింది. ఈ మేరకు రాత్రి 10:30 దాటితే లాఠీ పోలీసే ఉంటుందని ప్రకటించారు.
హైదరాబాద్ లోని పాత బస్తీలో అర్థరాత్రి అయినా జనం రోడ్ల మీద ఉండటంతో పోలీసులు మైక్ తో హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.