సునామీలా విరుచుకుపడిన వరద నల్లకుంట పద్మకాలనీలో కొట్టుకపోయిన బండ్లు, కార్లు

సునామీలా విరుచుకుపడిన వరద నల్లకుంట పద్మకాలనీలో కొట్టుకపోయిన బండ్లు, కార్లు

హైదరాబాద్ కుండపోత వర్షానికి వీధుల్లో వరద పోటెత్తింది. ఏప్రిల్ 29వ తేదీ శనివారం తెల్లవారుజామున రెండు గంటల్లోనే పడిన వానకు నాలాలు ఉప్పొంగి ప్రవహరించాయి. వీధుల్లో వరద సునామీలా విరుచుకుపడింది. సిటీ హాట్ స్పాట్ గా ఏరియా అయిన నల్లకుంట పద్మకాలనీ వీధుల్లో అయితే సునామీ తరమాలో వరద ప్రవహించటం కాలనీ వాసులను భయాందోళనలకు గురి చేసింది. ఈ వరదకు బండ్లు, కార్లు కొట్టుకుపోయాయి.

రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాల అడ్రస్ గల్లంతు అయ్యింది. పద్మకాలనీలో నాలా పనులు జరుగుతుండటంతో.. రోడ్ల పక్కన ఉన్న కరెంట్ స్తంభాలు కూలిపోయాయి. వరద ప్రవాహానికి బైక్స్, కార్లు నాలాలోకి కొట్టుకొచ్చాయి. గంటపాటు ఏం జరుగుతుందో అర్థం కాక.. ఇల్లు కూలిపోతాయా అన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు పద్మకాలనీ వాసులు. 

పద్మకాలనీలోని అపార్ట్ మెంట్ సెల్లార్లలోకి నీళ్లు వచ్చాయి. వాహనాలు నీట మునిగాయి. వర్షం తగ్గిన తర్వాత నీళ్లు వెళ్లిపోయిన.. వీధుల్లో.. ఇళ్లల్లోకి భారీగా మురుగు వచ్చి చేరింది. దీంతో కాలనీ మొత్తం కంపు కొడుతుందని కాలనీ వాసులు ఆందోళన చేస్తున్నారు. కరెంట్ స్తంభాలు కూలిపోవటంతో కరెంట్ లేదు.. మంచినీళ్లు లేవని.. కనీసం పాల ప్యాకెట్లు తెచ్చుకోవటానికి కూడా రోడ్లు బాగాలేవని.. ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోవటం లేదని ఆందోళనకు దిగారు కాలనీవాసులు.

https://www.youtube.com/watch?v=WOSmbdeYw6U