ఈ వర్షాల టైంలో.. వర్క్ ఫ్రమ్ హోం బెటర్ : నెటిజన్ల డిమాండ్

ఈ వర్షాల టైంలో.. వర్క్ ఫ్రమ్ హోం బెటర్ : నెటిజన్ల డిమాండ్

సెప్టెంబర్ 3వ తేదీ ఆదివారం..సెలవు.  ఫుల్గా ఎంజాయ్ చేసిన ఉద్యోగులు...సెప్టెంబర్ 4వ తేదీ సోమవారం రాగానే అబ్బా..మళ్లీ ఆఫీసులకు వెళ్లాలా అంటూ నిట్టూరుస్తారు. అయితే ఈ బాధకు తోడు..తెల్లవారుజాము నుంచి బీభత్సమైన వాన. సిటీ అంతా ట్రాఫిక్ జామ్. బండి బయటకు తీయాలంటేనే భయం. ఎక్కడ ఇరుక్కుపోతామో అని. ఈ నేపథ్యంలో ప్రతీ  ఉద్యోగికి వచ్చే మొదటి ఆలోచన. వర్షాల టైంలో  వర్క్ ఫ్రం హోమ్ ఉంటే ఎంత బాగుండో అని.

వానల్లో ఇంటి దగ్గరే వర్క్ ఉంటే.. 

వానలో బయటకు వెళ్లాలంటే చాలా  ఇబ్బంది. రోడ్లపై ఎక్కడికక్కడ పారే నీరు. నోర్లు తెరిచే మ్యాన్ హోళ్లు.  గంటకొద్ది ట్రాఫిక్ జామ్. ఈ సమస్యలను దాటుకోని ఆఫీసులకు చేరాలంటే ఓ యుద్దమే చేయాలి.  చివరకు వీటన్నింటిని దాటి ఆఫీసుకు వెళ్లామా..అక్కడ పని ఒత్తిడి. ఈ సమయంలో  ప్రతీ ఉద్యోగి అనుకుంటాడు..వాన పడుతుంది కదా..వానలో ఏం వెళ్తాం.  వర్షాల సమయంలో వర్క్ ఫ్రమ్ హోం ఇస్తే ఎంచక్కా ఇంటి దగ్గరే ఏ రిస్క్ లేకుండా పనిచేసుకుంటాం కదా అని. 

నెటిజన్ల డిమాండ్..

సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం లెవగానే వాన దంచికొడుతుండటంతో ఆఫీసుకు వెళ్లలేని కొందరు నెటిజన్లు..సోషల్ మీడియాలో  వర్క్ ఫ్రమ్ హోం కోసం డిమాండ్ చేశారు. తమ ఆఫీసుల్లోని పై అధికారులను, బాస్ లను వాన పడుతుంది...ఆఫీసులకు రాలేము.  ఇంటి నుంచే పనిచేస్తామని రిక్వెస్ట్ చేశారు. కొందరైతే తమ బాసులను బెదరించారు కూడా. వానల సమయంలో ఆఫీసుకు రాను. చేస్తే ఇంటి దగ్గరే  వర్క్ చేస్తే..లేదంటే లీవ్...అంటూ తెగేసి చెప్పేశారు. కొందరు ఉద్యోగుల బాధను అర్థం చేసుకున్న కంపెనీల సీఈవోలు..వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చారు. మరికొందరు ఉద్యోగుల బెదిరింపులకు తలూపారు. 

Also Read : సెప్టెంబర్ 5న ఆర్టీసీ రాఖీ పండగ లక్కీ డ్రా.. అదృష్టవంతులెవరో..

అబద్దాలతో సెలవు పెట్టేశారు..

వారం మొదటి రోజే వర్షం దంచికొట్టడంతో..ఆఫీసుకు రాలేని కొందరు..రాబుద్ది కాలేని కొందరు ఉద్యోగులైతే అబద్దాలు చెప్పి మరీ సెలవు పెట్టేశారు. ఆరోగ్యంపైనో..లేక ఇతర కారణాలతో తాము ఆఫీసుకు రాలేనంటూ మెసేజ్ లు పెట్టి వదిలేశారు. ఈ మెసేజ్ లకు కొందరు సీఈవోలు చేసేదేమి లేక సరే అన్నారు. మరికొందరు రావాల్సిందేనని పట్టుబట్టారు. ఇందులో కొందరు తప్పని పరిస్థితుల్లో ఆఫీసులకు వెళ్లారు. 

మొత్తానికి వానలు..కొందరు ఉద్యోగులకు మేలు చేకూర్చగా..మరికొందరు ఉద్యోగులు అయితే..వానలో తడుచుకుంటూ..ట్రాఫిక్ జామ్ లో ఇబ్బంది పడుతూ ఎలాగోలా ఆఫీసు చేరారు. అయితే వానలో సమయంలో వర్క్ ఫ్రం హోం ఇస్తే బాగుంటుందని నెటిజన్లు, ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. సమయం ఆదా అవడంతో పాటు..పని కూడా ఎక్కువ అవుతుందంటున్నారు.