ఇవాల్టి నుంచి హైదరాబాద్ రియలైజేషన్ టూర్

ఇవాల్టి నుంచి హైదరాబాద్ రియలైజేషన్ టూర్

బషీర్ బాగ్, వెలుగు:  సహజ యోగాతో ప్రశాంతత, ఆనందం అందించేందుకు మంగళవారం నుంచి  ఈనెల 30 వరకు ‘ హైదరాబాద్ రియలైజేషన్ టూర్ ’ నిర్వహిస్తున్నట్టు సహజ యోగ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గౌరు కృష్ణ తెలిపారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సోమవారం బ్రోచర్ ఆవిష్కరించి మాట్లాడారు. సుమారు 500 మంది ప్రతినిధులు దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి హాజరవుతానని చెప్పారు. 

వీరు 4 రోజులు సహజయోగా పరిచయం, స్ట్రెస్ మానేజ్ మెంట్ సెషన్స్ కాలేజీలు, స్కూళ్లలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల28న, నిజాంకాలేజ్ గ్రౌండ్స్ లో ఈనెల 29న, చందానగర్ లోని పీజేఆర్ స్టేడియం సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరిని సహజయోగ పరిచయ కార్యక్రమాలకు వచ్చి, అన్ని రకాల ప్రయోజనాలను ఆస్వాదించాలని కోరారు. సహజ యోగ అభ్యాసం ఇప్పుడైనా, ఎక్కడైనా ఉచితమని, ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు.