
హైదరాబాద్, వెలుగు: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో హైదరాబాద్ వరుసగా రెండో విజయం అందుకుంది. చెన్నైలోని ఐసీ గురునానక్ గ్రౌండ్‌లో ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో జార్ఖండ్‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 205/4తో మూడో రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 330 వద్ద ఆలౌటై 47 రన్స్ ఆధిక్యం అందుకుంది.
రాహుల్ రాదేశ్ (70), వరుణ్ గౌడ్ (65) రాణించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో జార్ఖండ్ 25.3 ఓవర్లలో 130 రన్స్‌కు ఆలౌటైంది. తన్మయ్ అగర్వాల్ నాలుగు, అనికేత్ రెడ్డి మూడు వికెట్లు పడగొట్టారు. ప్రత్యర్థి ఇచ్చిన 84 రన్స్ టార్గెట్‌ను హైదరాబాద్ 22.3 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి ఛేజ్ చేసింది. జార్ఖండ్ బౌలర్ రిషవ్ రాజ్ (5/44) పదునైన బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టినా.. రాహుల్ సింగ్ (35) పోరాటంతో హైదరాబాద్ గట్టెక్కింది.