హైదరాబాద్ సిటీ, వెలుగు: పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సిటీ జంట జలాశయాలకు మళ్లీ వరద పెరుగుతోంది. ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1789.50 అడుగుల మేరకు నీటి నిల్వలు ఉన్నాయి. జలాశయంలోకి 200 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా, అధికారులు నాలుగు గేట్లు ఓపెన్ చేసి 920 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.80 అడుగుల నీటి నిల్వలు ఉన్నాయి. ఇన్ ఫ్లో 500 క్యూసెక్కుల కాగా, అధికారులు రెండు గేట్లు ఓపెన్ చేశారు. 1,320 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొసాగుతోంది. జలాశయాల్లోకి మరింత వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
