హైదరాబాద్ బిర్యానీలో బొద్దింక.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

హైదరాబాద్ బిర్యానీలో బొద్దింక.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

హైదరాబాద్ వాసులు జొమాటోలో ఆర్డర్ చేసిన ఫిష్ బిర్యానీలో చనిపోయిన బొద్దింక, వైరల్ రెడ్డిట్ పోస్ట్‌లో ఫోటోలు వైరల్​ అయ్యాయి. 

బిర్యానీ అంటే ఎవ్వరికైనా ఇష్టమే.. ఇక హైదరాబాద్ బిర్యానీ.. అంటే నాన్ వెజ్ ప్రియులెవరైనా లొట్టలేసుకుంటూ తింటారు.. హోటళ్లు, రెస్టారెంట్లు అందుబాటులో లేకపోతే ఆర్డర్ ఇచ్చి మరి తెప్పించుకుంటారు.. అయితే, ఫిష్​ బిర్యానీ తిందామని అనుకొని జొమాటోలో ఆర్డరిచ్చి  ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి  ఫిష్​ బిర్యానీ తెప్పించుకున్న  వ్యక్తికి దిమ్మతిరిగే షాక్ తగిలింది

హైదరాబాద్​ బిర్యానీ భోజనంలో కీటకాలు .. బొద్దింకలు  తేలుతున్నాయి.  హైదరాబాద్​ నివాసి రెడ్డిట్​లో  హైదరాబాద్​ బిర్యాని గురించి  @maplesyrup_411 హ్యాండిల్‌లో పోస్ట్​ చేశారు.   తాను  కోటిలోని గ్రాండ్ హోటల్ నుండి జొమాటో-ఆర్డర్ చేసిన బిర్యానీలో చనిపోయిన బొద్దింకలు వచ్చాయని పోస్ట్​ చేశారు.  బహుశా హోటల్​ వారు నాకు అదనంగా ప్రోటీన్స్​ ఇద్దామనుకున్నారా.. అందుకే చనిపోయిన బొద్దింకలను ఫిష్​ బిర్యానీలో మిక్స్​చేసి పంపించారని తెలిపాడు. 

దీనిని సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయడంతోనే అది వైరల్​ అయింది.  దీనిపై నెటిజన్లు స్పందించారు.  కొంతమంది  ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారు.   ఒక వినియోగదారుడు మాత్రం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ... మీరు హోటల్​ యాజమాన్యంపై ఫిర్యాదు చేయండి... ఇక్కడ రోజు వందల మంది తింటారు.. నేను కూడా నెలకు రెండు మూడు సార్లు అక్కడ తింటానని ఒకరు పోస్ట్​ చేశారు.  ఇది చాలా షాకింగ్​ ఉందని మరొకరు పోస్ట్​ చేస్తారు.