వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ సినిమా.. హైదరాబాద్ సిటీలో ఇంపార్టెంట్ సీన్స్

వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ సినిమా.. హైదరాబాద్ సిటీలో ఇంపార్టెంట్ సీన్స్

వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. యూవీ  క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ సిటీలో  శరవేగంగా జరుగుతోంది. వరుణ్ తేజ్‌‌‌‌తో సహా కీలక పాత్రధారులంతా పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌‌‌‌లో ఇంపార్టెంట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఇండియాతో పాటు ఫారిన్‌‌‌‌లో మూడు మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేసి గ్రాండ్ విజువల్స్‌‌‌‌ను క్యాప్చర్ చేసినట్టు మేకర్స్ తెలియజేశారు.

ఇండో కొరియన్ హారర్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో  వరుణ్ తేజ్ డిఫరెంట్ లుక్‌‌‌‌లో కనిపించనున్నాడు. తను నటిస్తున్న 15వ చిత్రమిది. రితికా నాయక్  హీరోయిన్. సత్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. త్వరలోనే  టైటిల్‌‌‌‌ అనౌన్స్‌‌‌‌ చేయడంతో పాటు మూవీ గ్లింప్స్‌‌‌‌ను రిలీజ్ చేయనున్నారు.  తమన్‌‌‌‌ సంగీతం అందిస్తున్న  ఈ చిత్రానికి ‘కొరియన్‌‌‌‌ కనకరాజు’ అనే టైటిల్‌‌‌‌ను  పరిశీలిస్తున్నారు.