
హైదరాబాద్, వెలుగు: దుద్దిళ్ల శ్రీపాదరావు ఆల్ ఇండియా ఓపెన్ బిలో 1600 ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణ ప్లేయర్, 10 ఏండ్ల ఇమడబత్తిని జోయెల్ విజేతగా నిలిచాడు. తొమ్మిది రౌండ్లలో అజేయంగా నిలిచిన అతను 9 పాయింట్లు సాధించి టైటిల్‌ను గెలుచుకున్నాడు.
ఫైనల్ రౌండ్‌లో తమిళనాడుకు చెందిన సార్విన్ శివమ్‌ను ఓడించాడు. రాష్ట్రానికే చెందిన 12 ఏండ్ల మాస్టర్ షర్జీల్ హసన్ షేక్ 9 రౌండ్లలో 8 పాయింట్లు సాధించి మెరుగైన ప్రోగ్రెసివ్ స్కోర్‌తో రన్నరప్‌గా నిలిచాడు. 9 ఏండ్ల మనీష్ రెడ్డి లింగం 8 పాయింట్లతో మూడో ప్లేస్ సొంతం చేసుకున్నాడు. విన్నర్లకు తెలంగాణ చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్. లక్ష్మీ రెడ్డి, హైదరాబాద్ చెస్ సంఘం ప్రెసిడెంట్ కేఎస్ ప్రసాద్ ట్రోఫీలు అందించారు.