
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలోని ప్రైవేట్హాస్టళ్లలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. శనివారం ఎల్బీనగర్ జోన్‌లోని శ్రీనగర్ కాలనీ, లలితానగర్, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి జోన్‌లోని కేపీహెచ్ బీ, మూసాపేట, శేరిలింగంపల్లి జోన్‌లోని వినాయక్ నగర్, పత్రికా నగర్‌లో స్పెషల్‌డ్రైవ్ కొనసాగింది.
మొత్తం 60 హాస్టళ్లను తనిఖీ చేసి 38 హాస్టళ్ల యాజమాన్యానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. 7 హాస్టళ్ల కిచెన్లను క్లోజ్చేశారు. లైసెన్స్ లేకపోవడం, ఫుడ్ క్వాలిటీ, ఫైర్ సేఫ్టీ, శుభ్రత పాటించని హాస్టళ్లకు రూ.2,46,000- జరిమానా విధించారు.