
హైదరాబాద్: బుచ్చిబాబు ఇన్విటేషన్ టోర్నీకి హైదరాబాద్ జట్టును ప్రకటించారు. బుధవారం సమావేశమైన సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన టీమ్‌ను ఎంపిక చేసింది. ఆరుగుర్ని స్టాండ్ బైగా తీసుకున్నారు. ఈ నెల 18 నుంచి తమిళనాడులో ఈ టోర్నీ జరుగుతుంది. గ్రూప్–డిలో హైదరాబాద్, పంజాబ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఉన్నాయి.
జట్టు: రాహుల్ సింగ్ (కెప్టెన్), హిమతేజ, తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, అభిరత్ రెడ్డి, పి. నితీశ్ రెడ్డి, వరుణ్ గౌడ్, అవినాశ్ రావు. రాహుల్ రాధేశ్, అనికేత్ రెడ్డి, రవి తేజ, సరను నిశాంత్, ఆశిష్ శ్రీవాస్తవ, పృథ్వీ రెడ్డి.
స్టాండ్ బై: అమన్ రావు, కే. నితేశ్ రెడ్డి, సాయి ప్రజ్ఞాన్ రెడ్డి, నితిన్ సాయి యాదవ్, కార్తికేయ కాక్, అర్ఫాజ్ అహ్మద్.