V6 News

2047 నాటికి...హైదరాబాద్ లో 623 కి.మీ. మెట్రో నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

2047 నాటికి...హైదరాబాద్ లో 623 కి.మీ. మెట్రో నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     ఎంఎంటీఎస్, మెట్రో, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎస్ అనుసంధానం

హైదరాబాద్, వెలుగు: 2047 నాటికి సిటీలో ఏకంగా 623 కిలోమీటర్ల మేర మెట్రో రైల్, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎస్, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎస్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను విస్తరించి, ఎంఎంటీఎస్ తో అనుసంధానించనున్నట్లు విజన్ డాక్యుమెంట్ లో ప్రభుత్వం వెల్లడించింది. దీని ద్వారా ప్రయాణికులకు సీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెస్ మల్టీమోడల్ ట్రాన్సిట్ అనుభూతి అందించనున్నట్లు తెలిపింది. కేవలం ట్రాన్స్ పోర్టుకే పరిమితం కాకుండా.. కామన్ మొబిలిటీ కార్డ్, యూనిఫైడ్ యాప్స్, ట్రాఫిక్ సిగ్నల్ ప్రాధాన్యతలతో పాటు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ లింక్ స్పైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అభివృద్ధి చేయనున్నారు. 

భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ (పీఆర్టీ) సిస్టమ్స్, ఎగిరే టాక్సీల నిర్వహణకు సిద్దం చేయనున్నారు. నడిచేవారు, సైక్లిస్టుల భద్రతకు పెద్దపీట వేస్తూ దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర స్పెషల్ కారిడార్లు, ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లు, స్కైవాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లను నిర్మించనున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు హై-కెపాసిటీ రేడియల్ రోడ్ల నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయనున్నారు. 

ట్రాన్స్​పోర్టు బేస్డ్ డెవలప్మెంట్ ద్వారా మిక్స్డ్- యూజ్ జోన్లను సృష్టించి, ప్రజలకు 15 నిమిషాల పరిధిలోనే అన్ని సౌకర్యాలు దొరికేలా 15 -మినిట్ నేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హుడ్స్ ను తీర్చిదిద్దనున్నారు. అర్బన్ స్మార్ట్ ఫ్రైట్ కింద డ్రోన్ లాజిస్టిక్స్, గిగ్ ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా లోడింగ్ జోన్లు, మైక్రో హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లను ఏర్పాటు చేసి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదర్శవంతమైన, పొల్యూషన్ ఫ్రీ లివబుల్ సిటీ గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.