హైదరాబాద్ సిటీలో ఈ ఏరియాల్లో నీళ్లు బంద్

హైదరాబాద్ సిటీలో ఈ ఏరియాల్లో నీళ్లు బంద్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: మంజీరా ఫేజ్ 2, 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్​కు రుద్రారం వద్ద  భారీ లీకేజీ ఏర్పడింది. దీంతో శుక్రవారం తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వాటర్​ బోర్డు అధికారులు అత్యవసరంగా మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ పనులు శనివారం కూడా జరగనున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.

ఓ అండ్‌ ఎం డివిజన్ నం.6, 9, 17, 22 పరిధిలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా ఉండదని అలాగే బీరంగూడ, అమీన్‌పూర్‌, మియాపూర్‌, దీప్తి శ్రీ నగర్, కేపీహెచ్‌బీ హౌసింగ్‌ బోర్డ్‌, నిజాంపేట్‌, హైదర్‌ నగర్, మూసాపేట్‌, ఎర్రగడ్డ ప్రాంతాల్లోనూ నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.