V6 News

Chiru-Pawan: మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. చిరు, పవన్ చిత్రాల నుంచి ఒకే రోజు సర్‌ప్రైజ్‌ట్రీట్!

Chiru-Pawan: మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. చిరు, పవన్ చిత్రాల నుంచి ఒకే రోజు సర్‌ప్రైజ్‌ట్రీట్!

ఈ రోజు ( డిసెంబర్ 13 ) మెగా అభిమానులకు చరిత్రలో నిలిచిపోయేదిగా మారనుంది.  మెగాస్టార్ చిరంజీవి ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రెండు ప్రతిష్టాత్మక చిత్రాల నుంచి ఒకే రోజు కీలక అప్‌డేట్స్ రాబోతున్నాయి. ఈ వార్త ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహం రెట్టింపు అయింది.  సరిగ్గా సాయంత్రం 5 గంటల నుంచి ఒకదాని తర్వాత ఒకటిగా రాబోతున్న ఈ రెండు సర్‌ప్రైజ్‌లు టాలీవుడ్‌లో సరికొత్త వైబ్రేషన్‌ను సృష్టిస్తున్నాయి.

'మన శంకర వరప్రసాద్ గారు' రిలీజ్ డేట్ అప్‌డేట్!

టాలీవుడ్  డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’. దీనిపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ ను దాదాపు చివరికి వచ్చింది. ఈ చిత్రం సంక్రాంతి 2026 రిలీజ్ లక్ష్యంగా సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిరంజీవి మార్క్ స్టెప్పులతో కూడిన  'ఓ మీసాల పిల్ల' మాస్ సాంగ్ హృదయాన్ని హత్తుకునే మెలోడీ ' ప్రసాదు ఓ ప్రసాద్..' సాంగ్  ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ నేపథ్యంలో.. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు చిత్ర యూనిట్ ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.  అంతే కాదు నేటి నుంది అవుట్ డోర్ ప్రమోషన్ కు మూవీ టీం రెడీ అవుతోంది . ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా స్టార్ హీరోయిన్ నయనతార ననటిస్తుంది . ఇందులో విక్టరీ వెంకటేష్  ముఖ్య పాత్రలో అలరించనున్నారు.  ఈ డేట్ అనౌన్స్‌మెంట్ సంక్రాంతి రేసుపై భారీ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

 

డేఖ్‌లేంగే సాలా ఫుల్ సాంగ్ లాంచ్!

మరోవైపు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ . ఈ సినిమా ప్రమోషన్స్ సైతం నేటి నుంచే అఫీషియల్‌గా మొదలవుతున్నాయి.  ' గబ్బర్ సింగ్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ మళ్లీ కలిసి పనిచేస్తుండటంతో, వారి నుంచి మరో సెన్సేషన్ ఖాయమనే అంచనాలు మెగా ఫ్యాన్స్‌లో తారాస్థాయిలో ఉన్నాయి. 

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘డేఖ్‌లేంగే సాలా’ ఫుల్ వెర్షన్‌ను ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ పాట విడుదల వేడుక రాజమండ్రి సమీపంలోని సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీ వేదికగా జరుగుతోంది. ఈ భారీ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ హాజరవుతారనే వార్త అభిమానుల్లో మరింత జోష్ నింపుతోంది. 

మాస్, యాక్షన్, ఎమోషన్స్‌తో కూడిన ఈ సాంగ్.. పవన్ స్టైల్, హరీష్ మార్క్ టేకింగ్‌తో అద్భుతంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ పాట విడుదల తర్వాత సోషల్ మీడియాలో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు కీలక అప్‌డేట్స్ మెగా ఫ్యాన్స్‌కు నిజమైన ఫెస్టివల్ ట్రీట్ ఇవ్వనున్నాయి. నేటి సాయంత్రం టాలీవుడ్ ట్రెండింగ్‌లో ఈ రెండు చిత్రాల హవా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.