V6 News

న్యూఇయర్ కి థాయ్ లాండ్ వెళ్తున్నారా..ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..లేకుంటే సర్వీస్ ఛార్జీల మోత తప్పదు

న్యూఇయర్ కి థాయ్ లాండ్ వెళ్తున్నారా..ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..లేకుంటే సర్వీస్ ఛార్జీల మోత తప్పదు

న్యూఇయర్ వేడుకలకు థాయ్ లాండ్ బెస్ట్ ప్లేస్ గా చాలామంది భావిస్తుంటారు. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన టూరిస్టు ప్రాంతాల్లో  ఒకటి థాయిలాండ్.. మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.  ముఖ్యంగా బ్యాంకాక్ , ఫుకెట్ లాంటి టూరిస్టు ప్రాంతాలను ఎంతో ఇష్టపడతారు. ముఖ్యంగా బ్యాంకాక్ నగరంలో రాత్రి బస, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, టేస్టీ టేస్టీ ఫుడ్స్ తోపాటు, అద్భుతమైన దేవాలయాలు ఈ నగరంలో  పర్యాటకులను మైమరింపేస్తాయి. అయితే థాయ్ లాండ్ లోని బ్యాంకాక్ లాంటి టూరిస్టు ప్లేస్ లకు వెళ్లాలంటే ఖర్చు భారం మరింత పెరగనుంది. 

థాయ్ లాండ్ ఎయిర్ పోర్టులలో సర్వీస్ ట్యాక్స్ లను భారీగా పెంచేందుకు సిద్దమయింది. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులలో సర్వీస్ ట్యాక్స్ 53 శాతం పెంచేందుకు థాయ్ లాండ్ పౌర విమానయాన బోర్డు ఆమోదం తెలిపింది. థాయ్ లో ఆరు ప్రధాన ఎయిర్ పోర్టులు అయిన సువర్ణభూమి, డాన్ ముయాంగ్, ఫుకెట్, చియాంగ్ మై, హాట్ యాయ్ , చియాంగ్ రాయ్థాయ్ లాండ్ ఎయిర్ పోర్టులలో సర్వీస్ ట్యాక్స్ 730 భాట్  అంటే మన ఇండియన్ కరెన్సీ లో (రూ.2100) లనుంచి 1120 (రూ.3200)భాట్ లకు పెంచనుంది. ఈ నిర్ణయంతో పెరిగిన సర్వీస్ ట్యాక్స్ లు,అమలుపై  ప్రయాణికుల్లో అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. 

పెరిగిన సర్వీస్ ట్యా్క్సులను ప్రయాణీకులు విడిగా చెల్లించాల్సిన అవసరం లేదు. బుకింగ్ సమయంలో కలిపి విమాన టిక్కెట్ల ధరలో  సర్వీస్ ఛార్జీ యాడ్ అయి వస్తుంది. ది బ్యాంకాక్ పోస్ట్ ప్రకారం..ఈ పెరిగిన సర్వీస్ ఛార్జీలు వచ్చే 2026 ప్రారంభంలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 
సర్వీస్ ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రయాణికులకు సౌకర్యాలు, ఎయిర్ పోర్టు సేవలు మెరుగు పర్చేందుకు, భద్రత బలోపేతం చేసేందుకు ఉపయోగించనున్నట్లు  థాయ్ లాండ్ పౌర విమానయాన బోర్డు తెలిపింది.