ఒమన్‌‌‌‌పై ఇరాన్ డ్రోన్ దాడి..ఇద్దరు భారతీయులు మృతి.. 11 మందికి గాయాలు

ఒమన్‌‌‌‌పై ఇరాన్ డ్రోన్ దాడి..ఇద్దరు భారతీయులు మృతి.. 11  మందికి గాయాలు

న్యూఢిల్లీ/మస్కట్: ఒమన్‌‌‌‌లోని సోహార్ నగరంలో జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం అధికారికంగా ధృవీకరించింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ ఒకటి శుక్రవారం ఉదయం సోహార్‌‌‌‌లోని అల్-అవాహి పారిశ్రామిక ప్రాంతంలో పడింది. ఈ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించగా, మరో 11 మంది గాయపడ్డారు.

 గాయపడిన వారిలో10 మంది భారతీయులే ఉన్నారని విదేశాంగ శాఖ తెలిపింది. గాయపడిన వారిలో ఐదుగురు ఇప్పటికే చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన ఐదుగురికి స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, డ్రోన్ దాడి మృతుల కుటుంబాలకు విదేశాంగ శాఖ ప్రగాఢ సానుభూతి తెలిపింది. 

మస్కట్‌‌‌‌లోని భారత రాయబార కార్యాలయం నిరంతరం ఒమన్ అధికారులతో, బాధితులు పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతోందని పేర్కొంది.