మన ఏం చేస్తాం.. మందు తాగాలంటే వైన్ షాపునకు వెళతాం లేదా బార్ కు వెళతాం ఇంకా డబ్బులు ఉంటే పబ్ కు వెళతాం.. అలా వెళ్లి.. ఇలా తాగేస్తాం.. డబ్బులు ఉంటే చాలు. ఇవన్నీ ఆ దేశంలో కుదరవు.. వైన్ షాపులు ఉంటాయి కానీ ఎవరికి పడితే వాళ్లకు అమ్మరు.. డబ్బులు ఇచ్చినా ఇవ్వరు.. మరి ఎలా ఇస్తారనే డౌట్ వచ్చిందా.. అక్కడికే వస్తున్నాం.. మీకు నెలనెలా వచ్చే జీతం పే స్లిప్.. శాలరీ పే స్లిప్ ఉంటుంది కదా.. అది చూపిస్తేనే మందు ఇస్తారు.. అంతేకాదండీ.. ఆ జీతం కూడా లక్షల్లో ఉండాలి.. ఇంతకీ ఏ దేశంలో అంటారా.. ఆ పూర్తి వివరాల కోసం చదివేయండీ...
ప్రపంచంలోని చాలా దేశాల్లో మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు, తాగడంపై గట్టి చట్టాలు ఉన్నాయి. అయితే కొన్నిసార్లు ఈ కొత్త నియమాలు ఇంటర్నెట్‌లో చాలా వైరల్ అవుతుంటాయి. అలాగే ముస్లిం దేశమైన సౌదీ అరేబియా ఇప్పుడు మద్యం కొనేందుకు ఒక కొత్త రూల్ పెట్టి, అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ కొత్త రూల్ ప్రకారం, మద్యం కొనాలంటే ప్రజలు వారి జీతం స్లిప్ (Salary Slip) చూపించాలి. అంతేకాదు అదికూడా నెలకి 50,000 రియాల్స్ లేదా అంతకంటే ఎక్కువ మన దేశం ప్రకారం దాదాపు 11 లక్షల ఆదాయం ఉన్నవారు మాత్రమే మద్యం కొనడానికి అర్హులట.
Also Read : సంక్రాంతికి ముందు 40 శాతం పెరిగిన పతంగ్ రేట్లు
సమాచారం ప్రకారం, సౌదీ అరేబియాలో మద్యం కొనడానికి ఇప్పుడు జీతం స్లిప్ చూపించాల్సి ఉంటుంది. రియాద్‌లో ఉన్న ఒక షాప్ నుంచి మద్యం కొనాలంటే ముందుగా మీ నెల ఆదాయం ఎంతో ప్రూఫ్ చూపించాలి
ఈ షాప్ మొదట విదేశీ రాయబారుల (Foreign Diplomats) కోసం మాత్రమే తెరిచారు. కానీ కొంతకాలంగా ప్రత్యేకమైన నివాస హోదా (Premium Residency) ఉన్న ముస్లిమేతరులకు కూడా ఇక్కడ మద్యం అమ్ముతున్నారు. అయితే, ఈ రూల్ గురించి సౌదీ ప్రభుత్వం అధికారికంగా ఎం చెప్పలేదు.
ప్రీమియం రెసిడెన్సీ అంటే:
దీనిని సౌదీ గ్రీన్ కార్డ్ అని కూడా అంటారు. దీనివల్ల స్కిల్స్ ఉన్నవారు, వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు సౌదీలో ఉండటానికి, పనిచేయడానికి, వ్యాపారాలు లేదా ఆస్తులు కొనడానికి అనుమతి లభిస్తుంది. ఈ పథకం 2019లో మొదలైంది. దీనికి దరఖాస్తు చేసుకునేవారు 21 ఏళ్లు నిండి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు ఇంకా కుటుంబాన్ని పోషించుకోగలిగేంత డబ్బు ఉండాలి.
ఈ కొత్త రూల్ వైరల్ అయిన తర్వాత, ఇంటర్నెట్‌లో జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది సరదాగా తీసుకోగా, మరికొందరు విమర్శించారు. ఒకరు ఈ రూల్ డబ్బు ఉన్న వాళ్లకే అని జోక్ చేయగా..... మరొకరు మద్యం కొనేందుకు కూడా ఆదాయం రుజువు అడగడం పిచ్చి అని అన్నారు. ఇంకొకరు పేదలకు మద్యం లేకపోవడం నవ్వు తెప్పిస్తోంది అని అనగా.... ఒకరైతే ఈ రూల్ ఇండియాలో లేదు, థ్యాంక్ గాడ్ అని కామెంట్ చేశారు.

