V6 News

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఓటేసేందుకు వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఓటేసేందుకు వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

హైదరాబాద్: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం (డిసెంబర్ 13) రాత్రి- పెద్ద శంకరంపేట దగ్గర జాతీయ రహదారి 161పై గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను- కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ (మం) మాగీ గ్రామానికి చెందిన లింగమయ్య, సాయమ్మ, మానస, సాయిగా గుర్తించారు పోలీసులు. 

లింగమయ్య, సాయమ్మ దంపతులు కొడుకు, కూతురితో కలిసి హైదరాబాద్ నుంచి ఓటు వేయడానికి సొంతూరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకేసారి కుటుంబం మొత్తం మరణించడంతో లింగమయ్య సొంతూర్లో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.