V6 News

జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఓటేసేందుకు వెళ్తూ ఇద్దరు యువకులు మృతి

జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఓటేసేందుకు వెళ్తూ ఇద్దరు యువకులు మృతి

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

 మృతులను హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన బుర్ర కళ్యాణ్ (27), బుర్ర నవీన్ (27)గా గుర్తించారు పోలీసులు. పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు సొంత గ్రామానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. నవీన్, కల్యాణ్ మృతితో నందనం గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. చేతికి అందొచ్చిన కొడుకులు చనిపోవడంతో మృతుల తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.