బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది అంకానికి చేరుకోవడంతో హౌస్‌లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. గ్రాండ్ ఫినాలేకి కేవలం ఒకే వారం మిగిలి ఉన్న ఈ కీలక సమయంలో, హోస్ట్ నాగార్జున ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌ప్రకటించి హౌస్ మేట్స్‌కి , ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చారు. శనివారం (డిసెంబర్ 13) ఎపిసోడ్‌లో మొదలైన ఈ ఫినాలే ఫీవర్, చివరి విజేత ఎవరనే దానిపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠతను రేపుతోంది..
తనూజకు నమ్మక పరీక్ష..5 లక్షలు కట్ ట్విస్ట్!
శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున హౌస్‌మేట్స్ మధ్య నమ్మకం అనే అంశంపై ఆసక్తికరమైన గేమ్ ఆడించారు. ఎవరిని నమ్మవచ్చు (గ్రీన్ ఫ్లాగ్), ఎవరిని నమ్మకూడదు (రెడ్ ఫ్లాగ్) అని చెప్పాల్సిందిగా కోరారు. అయితే, తనూజ వంతు వచ్చేసరికి నాగార్జున పెద్ద ట్విస్ట్ ఇచ్చారు: "తనూజ, నువ్వు ఫ్లాగ్స్ పెడితే, ఫైనల్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి రూ. 5 లక్షలు కట్ అవుతుంది. నీకు ఓకేనా?" అని ప్రశ్నించారు. దీనికి తనూజ, సార్, అది నా సొంత డబ్బు అయితే చేస్తాను. కానీ అది ఇంకొకరి విజేత డబ్బు, మనసు ఒప్పుకోదు సార్ అని భావోద్వేగంగా సమాధానం ఇచ్చింది. వెంటనే స్పందించిన నాగార్జున, "డిసైడ్ అయిపోయావా? ఆ ప్రైజ్ మనీ ఇంకొకరిది అని?" అంటూ దిమ్మతిరిగే పంచ్ వేశారు. ఈ వ్యాఖ్య ద్వారా ఆమె పరోక్షంగా తాను విన్నర్ కాదని ఒప్పుకుందనే చర్చ మొదలైంది.
డెమాన్ వర్సెస్ కళ్యాణ్..
ఈ నమ్మకపు గేమ్‌లో డెమాన్ పవన్.. ఇమ్మానుయేల్‌పై నమ్మకం ఉందని, భరణిపై నమ్మకం లేదని రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు. కళ్యాణ్ తనూజను నమ్మొచ్చని, డెమాన్‌ని నమ్మలేమని ఫ్లాగ్స్ ఇచ్చాడు. దీంతో కోపోద్రిక్తుడైన డెమాన్ పవన్, కళ్యాణ్‌తో నువ్వు చేస్తే గేమ్, నేను చేస్తే దెబ్బ వేయడమా? అని ప్రశ్నించాడు. డెమాన్ ఈ దూకుడు చూసిన నాగార్జున.. ఒరిజినల్ పవన్ ఇన్నివారాల తరువాత మాకు ఇప్పుడు కనిపించాడు అంటూ డెమాన్‌కు బలమైన కౌంటర్ ఇచ్చారు. మరోవైపు, తనూజ ఏకంగా సంజనాని నామినేషన్ ప్రక్రియ తరహాలో రెడ్ ఫ్లాగ్ ఇచ్చింది.
విన్నర్ రేసులో పెను మార్పులు!
బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరనే చర్చలో తనూజే ప్రముఖంగా ఉంది, ఆ తర్వాతే కళ్యాణ్ పేరు వినిపిస్తోంది. గత వారం వరకు కళ్యాణ్ హవా కొనసాగి, తనూజను కూడా వెనక్కి నెట్టేశాడు. అయితే, కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన తర్వాత, తన గెలుపు కంటే తనూజను గెలిపించడానికి ఆడుతున్నాడనే అభిప్రాయం ప్రేక్షకుల్లో పెరగడంతో అతని గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. ఇక, నిన్నటి ఎపిసోడ్‌లో తనూజ తనకిచ్చిన సెకండ్ ఫైనలిస్ట్ ఆఫర్ అయిన3 లక్షల పాయింట్లు తీసుకుంటే ప్రైజ్ మనీలో 3 లక్షలు కట్ ను తిరస్కరించింది. ఆడియన్స్‌తోనే తేల్చుకుంటానని చెప్పి, తన గెలుపుపై ఉన్న నమ్మకాన్ని, ప్రేక్షకులకు తనపై ఉన్న అభిమానాన్ని చాటింది. ఈ దృఢ నిర్ణయం ఆమె టైటిల్ విజయాన్ని మరింత బలంగా చేసింది.
చివరిగా, నాగార్జున డబుల్ ఎలిమినేషన్ ప్రకటిస్తూ, శనివారం ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి ఎలిమినేట్ కాబోతున్నట్లు హింట్ ఇచ్చారు. ఆదివారం ఎపిసోడ్‌లో మరో హౌస్ మేట్ భరణి నిష్క్రమించే అవకాశం ఉంది.

